సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని అంగన్వాడీ ఉద్యోగులు కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నిరవధిక సమ్మె నిర్వహించారు. "గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం ఇవ్వాలి" అంటూ నినాదాలతో నిరసన తెలిపారు. ఒక స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుండి ప్రసవం అయి తమ బాబుకి ఐదు సంవత్సరాలు వచ్చే వరకు అంగన్వాడి ఉద్యోగులు ఆలనా పాలనతో పాటు మంచి విద్య, క్రమశిక్షణ సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతున్నామని అంగన్వాడి ఉద్యోగులు పేర్కొంటున్నారు. "కన్నతల్లులు వాళ్ళైతే పెంచిన తల్లుల మేము అంటున్నారు". కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని, వేతనంలో సగభాగం పెన్షన్ నిర్ణయించాలని, అంగన్వాడి ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ చెల్లించాలి. మినీ టీచర్స్ ని ఎటువంటి షరతులు లేకుండా మెయిన్ టీచర్స్ గా గుర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్లకు 5 లక్షలు ఇవ్వాలి. పెన్షన్స్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలనీ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
-----------------------
Admin