సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారని ఈ గెలుపుతో తెలంగాణలొ కాంగ్రెస్ గెలుపుకు కూడా సంకేతాలు మొదలయ్యాయని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం రేగడి చిలకమర్రి, షాబాద్ మధ్య శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ తో కలిసి మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కర్ణాటకలో ప్రజలు బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టడానికి మోడీ సర్కార్ దక్షిణ తెలంగాణ పై అజమాయిషీ చెలయించేందుకు ప్రయత్నించారని దీనిని కన్నడ ప్రజలు ఎండగట్టారని, దేశ సంపదను కాపాడి దేశంలో మత రాజకీయాలకు, విద్వేషాలకు విరుద్ధంగా భారత్ జోడోయాత్ర ద్వారా ప్రజలకు సంకేతాలు ఇచ్చారని దీనిని ప్రజలు గ్రహించారని అన్నారు. కర్ణాటకలో మొదలైన విజయయాత్ర తెలంగాణకు చేరుతుందని ఇక్కడి నుండి చతిస్ ఘడ్, రాజస్థాన్ ఆ తర్వాత ఢిల్లీకి ఈ విజయ యాత్ర చేరుతుందని జోస్యం చెప్పారు. దేశ సంపదను కాపాడడానికి రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ కర్గే దార్షికతను కర్ణాటక ప్రజలు గుర్తించారాని అందుకే కన్నియుడుల తీర్పు చాలా గొప్పదని ప్రశంసించారు. దేశ సంపదను కాపాడే బాధ్యత కాంగ్రెస్ కు ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమానంగా గౌరవించడం రాజ్యాంగం కల్పించిన హక్కని దానిని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసి, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న గొప్ప అనుభవముగల యువ నాయకుడు రాహూల్ అని ఆయన సభ్యత్వాన్ని కేంద్రం రద్దు చేసిందని ఈ హక్కు ఎవరు ఇచ్చారని? ప్రశ్నించారు. అందుకే కర్ణాటక ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షాన్ని గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం ఆటలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ దేశ నిర్మాణం కోసం స్వాతంత్రం కోసం పనిచేసిన గొప్ప గాంధీ కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీని తీవ్రంగా అవమానించిన కేంద్ర చర్యలను ప్రజలు గమనించి సరైన తీర్పు ఇచ్చారని అన్నారు. దేశ సంపదను ఆదాని, అంబానీలకు దోచిపెడుతుంటే దానిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైనదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదాలో చేస్తున్న దాడిని తట్టుకోలేక ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంపదను కాపాడేందుకు కంకణ బద్ధులై ఉన్నారని అన్నారు. కర్ణాటక ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అదే తీర్పు తెలంగాణలో రాబోతుందని అన్నారు. కాంగ్రెస్ విజయ యాత్రను ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విజయాన్ని బట్టి విక్రమార్క శిబిరంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కు తినిపించగా వీర్లపల్లి శంకర్ భట్టి విక్రమార్కకు కేక్ తినిపించారు.
-----------------------
Admin