సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ / దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమం చింతలకుంట ఒక ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు రంగాలలో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిరాల కృషి చేస్తున్నారు అని సుధీర్ రెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆరోగ్యం మహిళా తదితర పథకాలు త్వరలో గృహలక్ష్మి పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం, మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటు, మార్కెట్ కమిటీల్లోను మహిళలకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో ఆడబిడ్డ పుట్టింది అంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గత తొమ్మిదేళ్ల సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొండంత భరోసాను కల్పిస్తున్నది. అమ్మాయి పుట్టగానే కెసిఆర్ కిట్టు పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయం అందజేస్తున్నది. వారి ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని అమలు చేస్తూ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నది. త్వరలో గృహలక్ష్మీ పేరిట సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకుంటే మహిళల పేరిట 3 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. అతివలకు రక్షణగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కెట్ కమిటీల్లోని రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఉద్యోగినులకు ప్రస్థతి సిలువలను పెంచి మహిళలకు అండగా నిలుస్తున్నది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో విలేజి ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రినిధి, గ్రామసంఘం నిధులు ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నది. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారాలుగా, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా మారారు. ఇలా మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గుప్త, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, డిప్యూటీ కమిషనర్లు మారుతి దివాకర్, కృష్ణయ్య, హయత్నగర్ ఎమ్మార్వో సంధ్యారాణి, కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, అధికారులు అశ్విని, సుస్మిత, కృష్ణవేణి, సృజన, నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మహిళ అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, అంగన్వాడీ మహిళలు, స్వీపర్లు, పలు స్వచ్ఛంద సంస్థ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin