సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని మక్తగూడ, మల్లాపూర్, మల్లాపూర్ తండా, గూడూరు, నందిగామ మండలం తాళ్ళగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాలు పట్టణాలను తలపిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
-----------------------
Admin