Thursday, 30 July 2026 09:36:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌదరిగూడ మండలంలో టిఆర్ఎస్ పార్టీ నుండి 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరికలు...

Date : 26 October 2023 07:14 AM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : అన్యాయాన్ని వీడి న్యాయం వైపు వచ్చాం మాకు పార్టీలో ఏ ఉద్యోగాలు కోరుకోవడం లేదు, నిజాయితీగా నిలబడిన వీర్లపల్లి శంకర్ ను గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం.. నాతో పాటు జెడ్పిటిసిలు ఇంకా ఇతర నాయకులు సర్పంచులు వచ్చారని ఇంకా 50 మంది సర్పంచులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి ప్రతాప్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం తాము అహర్నిశల కృషి చేస్తామని ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడెం మండలం పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ మరియు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రతాప్ రెడ్డి ప్రసంగిస్తూ.. టిఆర్ఎస్ పార్టీలో అన్యాయాలు అక్రమాలు రాజ్యం ఏలుతున్నాయని అక్రమాల పార్టీని వదిలి న్యాయంగా నిలబడ్డ వీర్లపల్లి శంకర్ వద్దకు వచ్చామని అన్నారు. తానే కాదు తన వెంట ఇద్దరు జెడ్పిటిసిలు ఒక మాజీ జెడ్పిటిసి ఒక మైనార్టీ నాయకుడు ఇంకా ఎంతో మంది సర్పంచులు వచ్చారని మరో 50 మంది సర్పంచులు ఇంకా ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నారని త్వరలోనే శంకర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారని సవాల్ విసిరారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి బీఆర్ఎస్ పార్టీకి తడిసిపోతుందని వ్యంగంగా మాట్లాడారు. ఆనాడు మహిళల కళ్ళలో కన్నీళ్లు చూడలేదా? అని ప్రశ్నించారు. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి సిలిండర్ 400 ఇస్తామని చెప్పడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కెసిఆర్ ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం అబద్ధమేనని ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి - వీర్లపల్లి శంకర్. కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోరారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో గొప్ప ఆదరణ లభిస్తుందని శంకర్ అన్నారు సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలతో రాష్ట్రంలో ప్రజా ఆదరణ వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీ పథకాలే ముఖ్యమని ప్రజలకు అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే వర్తింప చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది బైకులతో వీర్లపల్లి శంకర్ ప్రతాప్ రెడ్డిలకు ఘన స్వాగతం లభించింది. మైనారిటీ నాయకులు జమ్రుత్ ఖాన్ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు క్రాంతి రెడ్డి ఎంపీపీ యాదమ్మ ఈ మండలాల ప్రెసిడెంట్లు మండల ప్రెసిడెంట్లు మహిళా అధ్యక్షురాలు వజ్రమ్మ ,రజిత, మాజీ ఎంపీపీ బసవరాజ్ గౌడ్ సీనియర్ నాయకులు బాబర్ ఖాన్, తిరుపతి రెడ్డి, ఆగిరి రవికుమార్ గుప్తా, సుదర్శన్ గౌడ్, గిరిధర్, శశిధర్, అంబటి ప్రభాకర్, జాకారం శేఖర్ సర్పంచులు సలీం, ఆంజనేయులు, సీనియర్ నాయకులు వెంకట రాములు, వెంకట్ నర్సింహారెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ నాయకులు, మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: