సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల విద్యా వనరుల కార్యాలయంలో జర్నలిస్టుల పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకు ప్రభుత్వం 50% ఫీజు మినహాయింపు ఇచ్చిన జీవో కాపీని మండల విద్యాధికారి ఛత్రు నాయక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల రామయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టుల సభ్యులకు జీవో కాపీలను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ ఛత్రు నాయక్ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు 50 పర్సెంట్ ఫీజు మినహాయింపును, పాఠశాల యజమాన్యం కల్పించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్, పల్లె సుధాకర్, శివారెడ్డి, చిలక సైదులు,శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin