సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలంలోని చౌడంపల్లి, అల్లాపల్లిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్‌తో పాటు ఎంపీడీఓ పోలప్ప సందర్శించి హౌసింగ్ లబ్ధిదారులు ప్రారంభించని హౌసింగ్ వర్క్ కు హౌసింగ్ జియో ట్యాగింగ్ చేయడం హౌసింగ్ లబ్ధిదారులకు సిమెంట్ కానీ బిల్లులు కానీ ఏవి పెండింగ్ ఉండకూడదు అని సిబ్బందికి సూచించారు అనంతరం అంగన్ వాడీ అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు అంగన్వాడి పిల్లల పట్ల జాగ్రత్తగా వహించాలని. అంగన్వాడి సెంటర్ కు వచ్చిన వైఎస్ఆర్ కిట్లు గుడ్లు, పాలు, గర్భవతులకు బాలింతలకు, సక్రమంగా అందేలాగా చూడాలని సూచించారు. అనంతర ఓబులదేవర చెరువు మండలం తంగేడుకుంట సచివాలయం కి ఆకస్మిక తనిఖీ చేసి అన్ని రికార్డులను ధృవీకరించండి. అనంతరం ఓబుల దేవర చెరువు మండలం వెంకటాపురంలోనీ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి హాజరు రిజిస్టర్‌ని చూసి, అన్ని రికార్డులను నిర్వహించాలని సూచించారు. అనంతరం ఓబులదేవర చెరువు మండలం మిట్టపల్లి సచివాలయాన్ని ఎంపీడీవో పోలప్ప ఆకస్మికంగా సందర్శించారు.
-----------------------
Admin