Friday, 31 July 2026 02:43:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా 128వ జయంతి వేడుకలు...

Date : 29 September 2023 05:43 AM Views : 216

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని మాదిగ సంక్షేమ సంఘం (అంబేద్కర్ భవన్) నందు ఘనంగా విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా గారి 128వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా కన్వీనర్ కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా, అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, మాదిగ సంఘాల ఐక్యవేదిక జిల్లా కో కన్వీనర్ బరిగెల భూపేష్ కుమార్ మాట్లాడుతూ 1895 సంవత్సరంలో సెప్టెంబర్ 28న గుర్రం జాషువా జన్మించారని, చిన్నతనం నుండే కుల వివ క్షతను ఎదుర్కొని అనేక అవమానాలతో మంచి కవిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం జరిగిందన్నారు. 1941 సంవత్సరంలో గబ్బిలం రచనతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని, క్రీస్తు చరిత్ర , అనేక రచనలు రాశారన్నారు,ఆ రచనలు గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1970 లో ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణ పురస్కారం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆయనను ఘనంగా సత్కరించిందన్నారు. ఈ కార్యక్రమానికి మొదట మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు బొంకూరి పోశం, మన్నెంపెల్లీ కోటేశ్వరరావు గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సామర్ల సమ్మయ్య, మాటేటి గోపాల్ ,ఆవులూరి సంజీవరావు, కొత్తూరి మదనయ్య ఇండిగపల్లి శంకర్, కొత్తూరి రవి, జంగం కృష్ణ, ఇల్లందుల దుర్గయ్య, జనగం రాజయ్య,నమిల్ల మధు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: