Thursday, 30 July 2026 11:43:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూన్ 4న సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ప్రజా గర్జన బహిరంగ సభను జయప్రదం చేయండి...

Date : 31 May 2023 01:56 AM Views : 530

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జూన్ 4వ తేదీన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరగనున్న సిపిఐ ప్రజాగర్జన బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.. ఆయన నేరేడుచర్ల లో పార్టీ బహిరంగ సభ గోడపత్రికలను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ..... గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందారని దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవిస్తుందని రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సందర్భంలో ఇచ్చిన విభజన హామీలను అమలు చేయలేదని బయ్యారంఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం, ఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుతోపాటు ఇతర హామీలను కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటి తక్షణమే భర్తీ చేయాలని, గత డెబ్బై సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్, లుగా వర్గీకరించిందని తక్షణమే పాత చట్టాలను యధా ప్రకారం కొనసాగించేలా జీవో ఇవ్వాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఆహార ఎరువుల పెట్రోల్ సబ్సిడీలను కొనసాగించాలని లీటర్ పెట్రోల్ 50 రూపాయలు లీటర్ డీజిల్ 40 రూపాయలు గాను వంట గ్యాస్ ధర 500 గాను సామాన్యులకు అందు బాటలో ఉంచాలని, రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని కౌలు రైతులను గుర్తించి వారికి భద్రతా భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ కోరారు. గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో నేరేడుచర్ల పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘo నాయకులు యల్ల బోయిన వెంకన్న, కత్తి మట్టా రెడ్డి, పి నరేందర్ రెడ్డి, మల్లెపూల శ్రీను కొత్తపల్లి శ్రీను పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :