Friday, 31 July 2026 11:55:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మత్తు పదార్థాలపై స్కూల్స్, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి... -జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

Date : 30 April 2023 12:14 AM Views : 1034

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు నెలల్లోగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ మార్చాలని ఆదేశించడం జరిగిందని, అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. శనివారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మత్తు పదార్థాలు & మాదక ద్రవ్యాల నివారణ (నార్కోటిక్స్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ పదార్థాలు, ఎన్డిపిఎస్)పై జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న కర్ణాటక సరిహద్దు మండలాల పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాకు బెంగళూరు దగ్గరగా ఉండడం, ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు రావడం, పుట్టపర్తికి విదేశీ భక్తులు వస్తుండడంతో మత్తు పదార్థాలు వినియోగించే అవకాశం ఉంటుందని, జిల్లాలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమన్నారు. మత్తు పదార్థాలు & మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పాఠశాలలు, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తారు, వాటిని వాడితే ఏం అవుతుంది అని దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. పాఠశాలలు, కాలేజీలలో వారానికి ఒకటి రెండు సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని మేజర్ జంక్షన్లు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారులు ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాల పంటలు సాగు చేస్తే సమాచారం అందించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పనిచేసి డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి దొరికితే ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరు వాడుతున్నారు లాంటి పూర్తి సమాచారం సేకరిస్తున్నామన్నారు. మత్తు పదార్థాలు అరికట్టడంపై ప్రభుత్వ గైడ్లైన్స్ ని పాటించాలన్నారు. మత్తు పదార్థాలు వాడకుండా హిందూపురం ప్రాంతంలోని పరిశ్రమల ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలలు, కళాశాలలలో మత్తు పదార్థాల వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎవరైనా గంజాయి సాగుచేసిన తమకు సమాచారం అందించాలన్నారు. మత్తు పదార్థాల వాడకంపై గ్రామాల్లో మహిళా పోలీసుల ద్వారా పోస్టర్లు అంటించాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రాన్ని నాలుగు నెలల్లోగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, డి అడిక్షన్ సెంటర్కు వెళ్లాలన్నా 14500 అని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషినల్ ఎస్పీ పివిఆర్కే ప్రసాద్, సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్, డీఎస్పీలు గోవింద్, యశ్వంత్, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిఈఓ మీనాక్షి, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, బిసి వెల్ఫేర్ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, కదిరి ఆర్డీఓ రాఘవేంద్ర, తహసీల్దార్ అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :