సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో 18వ తేదీన ఆదివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:30 వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో 1975- సం,, నుండి1985 సం,,వరకు చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుతున్నట్లు పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంపాల .సుదర్శన్, షేక్.రహీముద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఉంటుందని భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు....
-----------------------
Admin