సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల పరిధిలోని రైతులు సబ్సిడీ లో విత్తనాలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి బోలిసెట్టి శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు . మఠం పల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం నందు జీలుగులు, వరి విత్తాలను,పెసర్లు ,శెనగలు సబ్సిడి ధరలలో లబించునని తెలియజేస్తూ వాటిని పొందగోరె రైతులు రైతు పట్టే దారు పాసు పుస్తకాలు, ఆధార్ జీరక్స్ లను జతపరచి వ్యవసాయ కార్యాలయంలో అధికారులకు ఇచ్చి పొందగలరని తెలిపారు. ప్రస్తుతం వర్ష భావ పరిస్థితులు నెలకొన్న దృష్ట రైతులు అట్టి విత్తనములను ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు విత్తుకొని మొలక శాతాన్ని పెంచుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏఈఓ భవన్ శ్రావ్యంజలి పాల్గొన్నారు.
-----------------------
Admin