సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఉచిత కరెంట్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బీఆర్‌ఎస్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా గులాబీ సైన్యం నిరసనలు చేపట్టింది. అధిష్టానం నిర్ణయంతో స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ఆదేశాలతో ఫరూఖ్ నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట నందిగామ, షాద్ నగర్ టౌన్ ప్రాంతాలలో టిఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కూడా ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు....
-----------------------
Admin