Thursday, 30 July 2026 01:35:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యెర్రా కామేష్ వినూత్న నిరసన ఏసీడీ చార్జీలను రద్దు చేయండి...

Date : 28 January 2023 12:01 AM Views : 575

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో యెర్రా కామేష్ వినూత్న నిరసన కరెంట్ చార్జీల విషయంలో ఏ.సీ.డీ పేరుతో ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలను మోపడం సరైంది కాదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ డిఈ కార్యాలయం ఎదుట కండ్లకు గంతలు కట్టుకుని చేతుల్లో ప్లకార్డులతో వినూత్న నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఏసీడీ చార్జీలను వెంటనే రద్దు చేయాలని,వ్యాపారుల నిర్వహణకు పోలీసు లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన సైతం వెనక్కు తీసుకోవాలని కోరారు.దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వాని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని,ఇదే నిజమైతే విద్యుత్ సంస్థలు రూ.60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్ళయని ప్రశ్నించారు? విద్యుత్ సంస్థలకు ప్రభుత్వమే రూ. 20 వేల కోట్ల బకాయిలు పడిందని తెలిపారు. బహిరంగ మార్కెట్ లో అడ్డగోలు రేట్లకు కరెంట్ కొని ఆ భారాన్ని ప్రజల నెత్తిన రుద్దాతున్నారని ఆరోపించారు..ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాలు మార్చుకోకపోతే ప్రజల తరుపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అనంతరం సబ్ ఇంజనీర్ శ్రీ లక్ష్మీ కి వినతిపత్రం అందజేశారు ఈకార్యక్రమంలో సాయి,నాగుల రవికుమార్,తాటిపాముల హరికృష్ణ,ఆముదాల భరత్,ఆకుల విజయ్,సన్నీ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :