Thursday, 30 July 2026 11:58:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డీజే సౌండ్ చాలా ప్రమాదకరం..వైద్య పరీక్షల్లో షాకింగ్ నిజాలు

Date : 20 May 2026 09:08 PM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఇటీవలే డీజే విపరీతమైన శబ్దం కారణంగా ఒక యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ లోబంధువుల ఇంట్లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు సదరు యువకుడు హాజరయ్యాడు..వివాహ ఊరేగింపులో భాగంగా అక్కడ భారీ శబ్దాలతో కూడిన డీజే సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. డీజే నుండి వస్తున్న హై-డెసిబెల్ శబ్దాల హోరుకు మిగతా యువకులతో కలిసి ఆ యువకుడు కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేశాడు..అయితే డీజే స్పీకర్ల నుండి వచ్చిన విపరీతమైన సౌండ్ బేస్ కు యువకుడి శరీరం తట్టుకోలేకపోయింది..డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారిగా తల పట్టుకుని అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు..తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు (EEG మరియు స్కానింగ్) నిర్వహించగా, డీజే విపరీతమైన శబ్దాల ఒత్తిడి కారణంగా మెదడులోని రక్తనాళాలు చిట్లి, రక్తం గడ్డకట్టినట్లు నిర్ధారణ అయింది.. ​యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. ​ఇలాంటి సంఘటనలు డీజే శబ్దాల వల్ల కలిగే ప్రాణాంతక నష్టాలను మరోసారి హెచ్చరిస్తున్నాయి. వివాహాలు, పండుగల ఊరేగింపుల్లో విపరీతమైన శబ్దాలు చేసే డీజేలకు యువత, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారు వీలైనంత దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు..

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: