సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సమితి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడినదే తెలంగాణ రక్షణ సమితి. తెలంగాణ రక్షణ సమితి 119 నియోజకవర్గాలలో, 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థిని గా గొడ్ల శ్రీలతను ప్రకటించారు. గొడ్ల శ్రీలత మాట్లాడుతూ, సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుపే దిశగా పనిచేస్తానని, సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక మహిళ అభ్యర్థిని ఎమ్మెల్యే కాండేట్గా ప్రకటించడం సత్తుపల్లి నియోజకవర్గము ఏర్పడిన తర్వాత ఇదే ప్రధమమని తెలియజేశారు. తనకు టిక్కెట్టు కేటాయించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రెస్ మీట్ లో ఖమ్మం జిల్లామహిళా కన్వీనర్ గా కొలి పాక నాగమణిని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ బుర్ర సోమేశ్వర్ గౌడ్, పినపాక ఎమ్మెల్యే అభ్యర్థిని పూణేమ్ సీతక్క తదితర నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin