సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నాయకత్వంలో కొత్తగూడెం నియోజవర్గం నుండి భారీ జన సమీకరణతో వెళతాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తీలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన మహోతరమైన జోడో యాత్రకి మద్దతుగా కొత్తగూడెం నియోజకవర్గం నుండి టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ నాయకత్వంలో భారీ జన సమికరణతో జోడో యాత్రలో పాల్గొనడం జరుగుతుందని 20 కార్లు, 10 బస్సులతో 01.11.2022 తేదీ బాలానగర్ లో పాల్గొనడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,ఉద్యోగ,నిరుద్యోగ ఉపాధ్యాయు ,బడుగు బలహీన వర్గ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య తెలిపారు. ఈ కార్యక్రమములో:కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏ.బి చారి,నాగేశ్వరరావు, భూక్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin