Friday, 31 July 2026 01:39:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సంక్షేమ ఫలాలు పొందవలసిన గిరి పుత్రులకు తీవ్ర అన్యాయం...

Date : 06 September 2025 11:43 PM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్&బి గెస్ట్ హౌస్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశ పార్లమెంటులో RTI వేసి 342 ఆర్టికల్ ప్రకారం 1976 లంబాడీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తింపు లేదని పత్రాలను సంపాదించి 2011లో హైకోర్టులో మొదటిసారిగా లంబాడీలపై కేసు నమోదు చేయించిన ఆదివాసి సంక్షేమ పరిషత్, ఉమ్మడి సంఘాలకు మాత్రమే ఉందని అన్నారు.1976 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ,ఎస్టీ ఆడినన్స్ చట్టం ప్రకారం మూడు వర్గాలను ఎస్టీలుగా పేర్కొనబడిన కులాలను బంజారా,సుగాలీలను పరిగణించలేదు.వీళ్ళు అసలైన ఆదివాసులు కాదని వాళ్ళను ఎస్టి జాబితాలో పరిగణించడం వల్ల విద్య, ఉద్యోగం సంక్షేమ పథకాలలో అక్రమంగా లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. ఆదివాసులకు భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు,ఎన్నో హక్కులు చట్టాలు సంక్షేమ పథకాలు కలిగి ఉన్నప్పటికీ కూడా పొందవలసిన గిరిపుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసియువతి, యువకులు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆదివాసి అస్తిత్వం కాపాడాలని పెద్ద ఎత్తున ఆదివాసులు కలిసికట్టుగా ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు కృష్ణ బాబు,ఉపాధ్యక్షులు తాటి రాంబాబు,కార్యదర్శి కుర్సం శంకర్,తాటి నాగరాజు, రఘు,రాజ్ కుమార్ సంపత్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: