సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నిరుద్యోగ యువతను కెసిఆర్ మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మండవ వెంకటేశ్వర్ల గౌడ్ విమర్శించారు. హుజూర్ నగర్ మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హుజూర్నగర్ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇంటికి ఉద్యోగం ఇవ్వకుండా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించిన కేసీఆర్ నేటి వరకు కూడా ఇవ్వకపోగా మరలా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గతంలో చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం డీఎస్సీ వేసి నియామకాలు చేపట్టిన విషయాన్ని తెలంగాణ యువత గుర్తించుకోవాలన్నారు .నేడు తెలంగాణలో ఉద్యోగాలు లేక యువత దిక్కుతోచని స్థితిలో ఉన్నదని, గడ్డాలు పెరిగి పిల్ల నిచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు .తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి బడుగుల పాలన రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం మండల కమిటీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ మండల కమిటీని ఎంపిక చేశారు ముఖ్య నాయకుల అభిప్రాయాల మేరకు కమిటీని ప్రకటించారు మండల పార్టీ అధ్యక్షునిగా కష్టాల కనకరత్నం మండల పార్టీ ఉపాధ్యక్షులుగా తమ్మిశెట్టి వీరస్వామి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా తురక గోపిని నియమించారు .ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల పార్టీ కన్వీనర్ నాగు నాయక్ , పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , గరిడేపల్లి మండల పార్టీ కన్వీనర్ కీసరి నాగయ్య ముదిరాజ్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మీసాల సైదులు , మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మస్తాన్ , బీసీ సెల్ నాయకులు గుండు వెంకటేశ్వర్లు గౌడ్, దారా కాసిం, కష్టాల మహేష్ ,మచ్చ నరసయ్య,బద్రి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin