Friday, 31 July 2026 01:40:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రిటర్నింగ్ అధికారుల తో సమావేశం... -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల

Date : 27 August 2023 06:06 AM Views : 302

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంపులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి మినీ సమావేశపు హాలులో ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, ఎలక్ట్రో లిటరసీ క్లబ్స్ నిర్వహణ, బూతు స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు అప్ డేట్ చేయుట, స్వీప్ కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ నెల 27 ఆదివారం, వచ్చే నెల 2, 3 తేదీల్లో జరుగనున్న ప్రత్యేక క్యాంపులు నిర్వహణపై గ్రామాలు, పట్టణాలల్లో ప్రజలకు తెలియచేసేందుకు టామ్ టామ్ వేయించాలని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పని సరిగా వారి వారి ఓటును పరిశీలించుకునే విడహ్నగా పరిశీలించే విధంగా సమాచారం క్షేత్రస్థాయికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంపు నివేదికలలో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నివేదికలు పంపాలని చెప్పారు. బూత్ స్థాయి అధికారుల ఫోన్ నెంబర్లు అప్డేట్ చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు నియోజకవర్గాలల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ రాంబాబు, డి ఆర్ డి ఓ మధుసూదన్ రాజు, డిఆర్వో రవీంద్ర బాబు, ఎస్డీసి. కాశయ్య, భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: