సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఎస్పీ యస్ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు , షీ టీమ్స్ ఇన్చార్జి సూర్యాపేట డిఎస్పి పరికే నాగభూషణం, కోదాడ డి.ఎస్.పి ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ సిఐ రామలింగా రెడ్డి సహారంతో హుజూర్ నగర్ ఎస్సై హరికృష్ణ హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు మరియు పిల్లల భద్రత గురించి, పోలీస్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.పోలీస్ కళాబృందం చేత షీ టీమ్స్, మహిళల భద్రత రక్షణ,100 డైల్ గురించి, సోషల్ మీడియా, ఓటిపి ఫ్రాడ్స్, సైబర్ నేరాల గురించి, భరోసా సెంటర్ గురించి,టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి,సెల్ ఫోన్ వలన కలిగే అనర్ధాల గురించి, విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆట, పాటల ద్వారా కళాశాల విద్యార్థి, విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ ఎస్సై హరికృష్ణ , సూర్యాపేట షీ టీం ఏ ఎస్సై పాండునాయక్ , షీ టీం హెడ్ కానిస్టేబుల్ జాఫర్ , ఎస్ఐ లింగారెడ్డి , ఏఎస్ఐ రమేష్ , సిబ్బంది నాగరాజు,కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ , పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, కృష్ణ, గురులింగం విద్యార్థి, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin