సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుగొండ పట్టణంలో బాబయ్య దర్గా చేపట్టాల్సిన పనుల గురించి అధికారులతో తొందరగా పని చేపట్టాలి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో పెనుగొండ బాబయ్య దర్గా కూడా ప్రధానమైనది అని పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ మత సామరస్యానికి ప్రతీకగా దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన పెనుకొండ బాబయ్య దర్గాకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దర్గా అభివృద్ధికి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసిన నేపధ్యంలో చేపట్టాల్సిన పనుల గురించి వక్స్ బోర్డు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, దర్గా పీఠాధిపతి తాజాబాబా తో కలసి శుక్రవారం రాత్రి వరకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా దర్గా లోపల భాగంలో టైల్స్ ఏర్పాటు, పాలిష్ బండలు వేయుట, భక్తుల భోజనాల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు, దర్గా లోపలి భాగంలో దుర్గంధానికి తావు లేకుండా డ్రైవ్ నిర్మాణం, భక్తుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించుట, ప్రత్యేక బాత్ రూంల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ లైటింగ్, వాహనాల పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయడం, కాంపౌండ్ నిర్మాణం. భక్తులు వేచి వుండడానికి ప్రత్యేక షెడ్ల నిర్మాణం వంటి విషయాలపై ఎమ్మెల్యే సుధీర్ఘంగా చర్చించారు. దక్షిణ భారత దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన దర్గాగా తీర్చుదిద్దుదామని ఆయన పేర్కొన్నారు. పలు విషయాలపై తగిన సూచనలు. సలహాలు అందించారు. అనంతరం దర్గాకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులు గురించి సమీక్షంచి, వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముస్లీంలు భారీగా పాల్గొన్నారు, మత పెద్దలు, పెనుకొండ వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నాగలూరుబాబు, టౌన్ కన్వీనర్ బోయనరసింహ, నగర పంచాయితీ చేర్మన్ ఉమర్ ఫరూక్ ఖాన్, వైస్ చైర్మన్ సునీల్, కౌన్సిలర్లు, నగర పంచాయితీ కమిషనర్ వంశీకృష్ణ బార్గవ్, ఎంపీపీ గీత, జడ్పీటీసీ శ్రీరాములు, ముఖ్యనాయకులు మాజీ ఎంపీటీసి రామ్మోహన్రెడ్డి, జయశంకరరెడ్డి, ఫరీద్, బోయబాబు, శ్రీరాములు, నేమతుల్లా. సికృతుల్లా, చండానాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin