సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండల పరిధిలో గల కర్ని గ్రామంలో ఎంపిపిఎస్ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని ఆయన కొనియాడారు. మన ఊరు మన బడి పనులలో జాప్యం వహించవద్దని ఆయన తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులలో నాణ్యతగా ఉండాలని గుత్తేదారులకు సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న కలెక్టర్ గారికి లేదా నా దృష్టికి తీసుకురావాలన్నారు. మక్తల్ మండలంలోని మొత్తం 09 గ్రామ పంచాయతీ లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ A. E లక్ష్మీ నారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, మాజీ సర్పంచ్ రాఘవేంద్ర గౌడ్, మాజీ ఎంపీటీసీ రాధా దత్తురాం , విఆర్ఎ ఆంజనేయులు, గాసం రమేష్, పంది వెంకటేష్, లింగారెడ్డి, ఉప్పరి అంజప్ప తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin