సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలో వచ్చిన గాలి, వాన, దుమ్ము, వడగండ్ల వానకు పలు గ్రామాలలో రేకులతో నిర్మించిన గృహాలు పూరి ఇల్లులు భారీ గాలులు వీచడం వల్ల పూర్తిగా నాశనం అయినాయి.. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వేముల రమణ వేముల నరేష్ మరియు కాంగ్రెస్ నాయకులు పలు గ్రామాలలో నష్టపోయిన ప్రజలని వారి గ్రామాలకు వెళ్లి పరామర్శించి వారికి మేము మా పార్టీ అండగా ఉంటాం మీకు జరిగిన నష్టనికి మా సాయ సహకారాలు అందిస్తామని మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చినారు అందుకు నష్టపోయిన ప్రజలు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశారు.. అదేవిధంగా మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు సహాయం చేయమని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్తలని ప్రజలు అభ్యర్థించినారు....
-----------------------
Admin