సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని, షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సీట్లు గెలిచి కెసిఆర్ కు బదులు తీర్చుకుంటామని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. షాద్ నగర్ నియోజక వర్గంలోనీ తుర్కల పల్లి, గాంధీ శంకర్ పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో సిపిఐ నేత శ్రీను నాయక్, జెడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, ఇబ్రహీం హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆరు గ్యారెంటీల పథకాలను ఇంటింటికీ వివరిస్తూ ప్రచారాన్ని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ మరియు షాద్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డి, నందిగామ వైస్ ఎంపీపీ మంజుల తులసి రామ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు వీరేశప్ప, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కేశంపేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గిరి యాదవ్, సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి, తో సహా ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా నాగరాజు యాదవ్, వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ ఆలస్యనికి పోకుండా పని చేయాలనీ 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రాన్ని పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలనీ 10 రోజుల్లో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్‌ల వరకు తీసుకువెళ్లాలి అని విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin