Friday, 31 July 2026 04:53:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ విజయోత్సవ సందర్భంగా మాజీమంత్రి దామోదర్ రెడ్డి మీడియా సమావేశం...

Date : 06 June 2024 10:10 AM Views : 761

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేటజిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ, భువనగిరి రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రేస్ పార్టీ విజయం సాధించింది.గెలిగిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు.అసెంబ్లీ ఎన్నికల్లో 4600 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందిన మాకు ఈ ఎన్నికల్లో 70 వేళ ఓట్ల మెజార్టీ ఇచ్చిన సూర్యాపేట ప్రజలకు కృతజ్ఞతలు.తుంగతుర్తి లో సైతం 70 వేలు మెజార్టీ సాధించడం హర్షించదగ్గ విషయం.ప్రజలకు కాంగ్రేస్ పై విశ్వాసం ఉండడం వలనే ఈ ఘన విజయాలను సాధించాం. అసెంబ్లీ ఎన్నికల్లో 4,600 ఓట్లతో గెలిచిన జగదీశ్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో 70 వేల తేడాతో వెనుకంజలో ఉన్నారు.నైతిక విలువ ఉంటే జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్.గెలిచిన తర్వాత సూర్యాపేట ప్రజలను మర్చిపోయిన జగదీశ్ రెడ్డి. ఏ మ్మెల్యే గా గెలిచిన జగదీశ్ రెడ్డి ఇప్పటివరకు కనీసం ఏ శాఖను సమీక్ష చేయలేదు.పది సంవత్సరాల కాలంలో అధికారులు అంతా పూర్తిగా అవితినీతిలో కూరుకుపోయారు.దమ్ముంటే రాజీనామా చేసి నాపై పోటీచేయ్ లక్ష ఓట్ల పైగా మెజార్టీతో గెలుస్తా.పది సంవత్సరాలు కాలంలో మీరు చేసిన అవినీతి, అక్రమాలను అన్నింటిని బయటికి తీస్తా..మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులను పిలిపించి ప్రతి శాఖతో సమీక్ష నిర్వహిస్తాను..ప్రతిశాఖలో అవినీతి జరిగింది. అన్ని వెలికితీస్తా.బి ఆర్ ఎస్ కండువా కప్పుకున్నవారికే ప్రభుత్వ పథకాలు అందజేశారు.మా ప్రభుత్వంలో అర్హులైన అందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను.హరితహారంలో కూడా విపరీతమైన అవినీతి జరిగింది.మున్సిపాలిటీ లో కనీస విది విధానాలు లేకుండా అధికారులు పనిచేస్తున్నారు.ఇల్లు కట్టకుండా అనుమతి ఇచ్చిన వాటిపై విచారణ జరిపించి వాటిని రద్దు చేస్తాం.సూర్యాపేటలో చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గ్రామాలలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. వాటన్నింటి పరిష్కారానికి కృషిచేస్తా.మూసి కింద ఉన్న ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరు అందే విధంగా చర్యలు చేపడతా..మంచినీరు లేని ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తా..రైతుసదస్సులు నిర్వహించి వారి సమస్యలను అన్ని పరిష్కరిస్తా..అంచెలంచెలుగా సూర్యాపేటను అభివృద్ధి చేస్తా..మెడికల్ కాలేజీని అందరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తాను.ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దుతా.స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ అన్ని సమస్యలు పరిష్కరిస్తాను.తెలంగాణలో 10 పార్లమెంట్ స్థానాలు గెలుస్తానని చెప్పాను.. ఓటమి చెందిన స్థానాల్లో బి ఆర్ ఎస్ వాళ్ళు బీజేపీ కి ఓట్లు మళ్లించడం వల్లే గెలుపు సంఖ్య తగ్గింది. ఇతర పార్టీల సహకారంతో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.ప్రజా దర్బార్ నిరంతరం కొనసాగించ బడుతుంది.ప్రజాదర్బార్ లో వసూళ్లు చేపడుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అవినీతిపైనే నా పోరాటం.ప్రజా దర్భార్ అనేది పారదర్శకంగా ఉంటుంది.ప్రజలకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.కాంగ్రేస్ తాకిడికి తోకముడ్చుకొని పోయిండు ప్రతిపక్ష పార్టీ నాయకుడు. రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ పరిస్థితి జీరో. అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: