సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజారుకు చెందిన 12వ వార్డుకు చెందిన మునుర్కాపు సంఘం సభ్యులు ఇతర బీసీ వర్గాల మరియు ఫేమస్ యూత్, అయ్యప్ప యూత్, జై భవాని యూత్, విష్ణు యూత్, శివ పార్వతి యూత్ 400 మంది సభ్యులు బిజెపి పార్టీలో చేయడం జరిగింది. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని అనడం ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని నిశ్చయించుకుంటున్నాము అని ఆర్మూర్ అభివృద్ధి శాంతి కేవలం పైడి రాకేశ్ రెడ్డి తో సాధ్యమని అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు కాకుండా మంచి బంధాలు ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు అందేలా చూస్తామని ఒకవేళ అందుబాటులో ఉంటాం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీనివాస్, జాగీర్దార్ నరేందర్ కొడిగేల శేఖర్,సృజన్,కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, కౌన్సిలర్ ఆకుల శ్రీనివాస్, సర్వసమా అధ్యక్షుడు ఆకుల రాజు, మాజీ సర్వసమాజ అధ్యక్షులు మోహన్,చెరుకు నారాయణ, ఉప్పల పోశెట్టి, మాజీ కౌన్సిలర్ వేణు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin