సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐ పి ఎస్ మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీ రాత్రి సూర్యాపేట పట్టణ పి ఎస్ పరిది శ్రీరామ్ నగర్ కాలనీ నందు వివాహితుడు షేక్ రఫీ ఉరి వేసుకుని చనీపోయినట్టు, మృతి పై అనుమానాలు ఉన్నాయని సోదరుడు పిర్యాదు చేయడం జరిగినది. పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా మృతిని భౌతికకాయం ను పోస్టుమార్టం చేయడం జరిగినది. పోస్టుమార్టం రిపోర్టు పై అనుమానాలు వచ్చిన దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ కేసులో టెక్నికల్ ఆధారాలను సేకరించి రఫీ హత్యకబాడ్డడు అని గుర్తించి మృతిని బార్య నస్రీన్ ను, ఆమెతో సంభందం ఉన్న భూక్యా వెంకన్న ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తన భర్తను తనతో సంబంధం ఉన్న వెంకన్న అతని స్నేహితులతో కలిసి పథకం ప్రకారం హత్యచేశామని మృతిని బార్య ఒప్పుకోవడం జరిగినది. ఇది ఇలా ఉండగా జూలై నెల 8 వ తేదీన రాత్రి సమయంలో వెంకన్న తన భార్యను బండిపై తీసుకుని సూర్యాపేట వస్తు మార్గం మధ్యలో చందుపట్ల వద్ద బైక్ ను కావాలని ప్రమాదానికి గురిచేసి బార్య రమాదేవి ని కొట్టి చంపి రోడ్డు ప్రమాద మరణంగా చిత్రీకరించి ఎవ్వరికీ అనుమానం రాకుండా జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు వైద్యం చేయించుకున్నాడు. ఈ మరణం పై వెంకన్న ను విచారించగా కావాలని ప్రమాదం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని భూక్యా వెంకన్న తన భార్య రమాదేవి నీ పథకం ప్రకారం హత్య చేయగా షేక్ నస్రీన్ తన భర్త రఫి నీ ప్రియుడితో కలిసి మరో ఇద్దరు అక్కినపల్లి శ్రీశైలం, సారగండ్ల మధు అనే ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేసింది. నలుగురు నిందితులను వారి వారి నివాసాల వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది. నేర విధానము_ భూక్యా వెంకన్న, అక్కనపల్లి శ్రీశైలం మరియు సారగండ్ల మధు ముగ్గురు స్నేహితులు. భూక్యా వెంకన్నకు షేక్ నస్రీన్ అను ఆమెతో అక్రమ సంబందం పెట్టుకొనగా! అట్టి విషయం ఇద్దరి ఇండ్లలో తెలిసిన తరువాత, భూక్యా వెంకన్న,నస్రీన్ కలిసి భూక్యా వెంకన్న భార్యను, నస్రీన్ భర్త రఫీ ని అడ్డుతోలిగించుకొని ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. పధకం లో బాగంగా తేదీ: 08-07-2023 రోజు రాత్రి 8 గంటల సమయంలో వెంకన్న అతని బార్య రమాదేవి కలిసి వారి స్వగ్రామం బళ్ళు తండా నుండి సూర్యాపేట కు వస్తున్న క్రమమంలో భీమళ తండాకు బండమీది చందుపట్లకు మద్య బండిని ప్రమాదానికి గురి చేసి పథకం ప్రకారంగా బార్య తలని పట్టుకొని బలంగా తలపై కొట్టి చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించినాడు, భూక్యా వెంకన్న కూడా రెండు రోజులు శ్రీహన్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కోమా లో ఉన్నట్లు నటించినాడు. (ఇట్టి విషయంలో చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఆక్సిడెంట్ మరణంగా గా కేసు నమోదు చేసినారు.) భూక్యా వెంకన్న భార్య మరణాంతరం షేక్ నస్రీన్ భర్త రఫీ వీరి అక్రమ సంబందం గురించి నస్రీన్ ఇంట్లో గొడవలు ఎక్కువ కావటంతో రఫీని చంపకపోతే ఇక వారికి మనశాంతి ఉండదని నిర్ణయించుకొని తేది: 09-10-2023 రోజు రాత్రి 1030 గంటల సమయంలో నస్రీన్ తన భర్త బయటకు పోయినది చూసి భూక్యా వెంకన్నకు ఫోన్ చేసి చెప్పగా! భూక్యా వెంకన్న, అక్కనపల్లి శ్రీశైలం మరియు సారగండ్ల మధులు నస్రీన్ ఇంటిలోకి వెళ్ళి ఇంట్లో తలుపు చాటుకు దాచుకొని ఉండగా రాత్రి 11 గంటల సమయంలో రఫీ ఇంటిలోకి రాగానే ముగ్గురు కలిసి రఫీని గట్టిగా పట్టుకోని చేతులతో కొట్టి క్రిందపడవేసి గొంతు నులిమి చంపగా! నస్రీన్ బయట ఎవరు చూడకుండా తలుపులు వేసినది. రఫీ చనిపోయినది నిర్ణయించుకున్నాక చీరతో రఫీ గొంతుకు కట్టి హాలులో సీలింగ్ ఫ్యాన్ కట్టి రఫీ తానే ఉరివేసికొని ఆత్మహత్య చేసుకున్నట్లు గా చిత్రీకరించినారు. తదుపరి వారు నస్రీన్ ని బెడ్రూంలో ఉంచి గడియ పెట్టి భూక్యా వెంకన్న, అక్కనపల్లి శ్రీశైలం మరియు సారగండ్ల మధు బయటకు వచ్చి హాలు తలుపు లోపలి గడియని కిటికీ లోనుండి పొడువాటి కర్ర సహాయంతో పెట్టి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయినారు. పై రెండు హత్యలు సినీ పక్కిలో పధకం రచించి చట్టానికి దొరకుండా ఉండాలనుకున్నా సూర్యాపేట పట్టణ పోలీస్ వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మిస్టరీ ని ఛేదించినారు. నిందితుల వివరములు 1) భూక్యా వెంకన్న వ,, 35 సం,,లు, వృత్తి: వ్యవసాయం, నివాసం: బాగ్యనగర్ కాలనీ, కుడకుడ, 2) అక్కనపల్లి శ్రీశైలం వ,, 35 సం,, లు, వృత్తి: జె ఎల్ ఎం నడిగూడెం నివాసం: సిరికొండ, మోతే మండలం 3)సారగండ్ల మధు వ,, 24 సం,,లు, వృత్తి: వ్యవసాయం, నివాసం: నామారం, మోతే మండల 4) షేక్ నస్రీన్ భర్త రఫీ, నివాసము: సూర్యాపేట పట్టణము. ఈ కేసును ఛేదించటంలో పర్యవేక్షణ చేసిన అదనపు ఎస్పి, సూర్యాపేట డి ఎస్ పి లను, బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్, ఎస్ ఐ లు యస్. కె. యాకూబ్, రవీందర్, ఐ.మహేంద్రనాద్ మరియు హెడ్ కానిస్టేబుల్ లు కరుణాకర్, కృష్ణ, సైదులు, ఆనంద్, మధులను మరియు సుధాకర్ లను సూర్యాపేట ఎస్పి గారు ఈ సందర్భంగా అభినందించడం జరిగినది. ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి ఎస్ పి రివార్డ్స్ ప్రకటించినారు.
-----------------------
Admin