సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి మండల కేంద్రంలోని జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశము నిర్వహించిన బి ఆర్ ఎస్ కె వి తుంగతుర్తి మండల భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొంకురి శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 21, (19s) ప్రకారం ప్రతి మనిషి యొక్క నిర్దిష్ట హక్కును కాపాడుకోవడానికి మరియు పనికి సమాన వేతనం పొందడానికి ఉద్యోగ భద్రత కోసం యూనియన్లను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం కల్పించారని అన్నారు, అంబేద్కర్ స్ఫూర్తితోనే కార్మిక శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న నవయుగ అంబేద్కరుడు ,కార్యసాధకుడు ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడు,గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే డా:గాదరి కిశోర్ కుమార్ అన్నారు, మట్టి పని చేసుకుని బతికె మాలాంటి వారిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని మా సంక్షేమం కోసం లేబర్ ఇన్సూరెన్సు కార్డుల ను అందించి వాటి ద్వారా పొందె సంక్షేమ బీమా పథకాలను మా అందరికి అందేలా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే డా"గాదరి కిశోర్ కుమార్ కి ఋణపడి ఉంటామని అన్నారు తుంగతుర్తి మండల కార్మికుల పక్షాన తెలియజేస్తున్నాను గత 30 ఏళ్ల నుండి ఈ వృత్తిలో ఉన్న ఏ నాయకుడు మమ్మల్ని దగ్గరగా తీసుకొని మా బాగోగులు, మా కష్ట సుఖాలను గాని తెలుసుకున్న నాయకుడు ఎవరు లేరని అన్నారు. కానీ ఎమ్మెల్యే మా సంక్షేమం కోరి ఎల్లవేళలా మా నిర్మాణరంగం నమ్ముకున్నటువంటి వందలాది కార్మికుల ప్రభుత్వపరంగా తనవంతు పరంగా సహకారాలు అందిస్తూ మాకు తోడై నీడై ఆదరణ కల్పిస్తున్నారు. అంతేకాకుండా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాకు మండల భవన నిర్మాణ కార్మిక యూనియన్ అధ్యక్షునిగా అవకాశం కల్పించి నాతోపాటు ఈ వృత్తిలో కొనసాగేటువంటి కార్మికులకు న్యాయం చేసే నాయకత్వాన్ని అందించి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులారా ఎమ్మెల్యే మాకు సంక్షేమం కోసం చేసే సేవలు మరువలేనివని మీకు కూడా తెలుసు అయినప్పటికీ ఎమ్మెల్యే మీద అపవాదాలు వేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని కార్మిక సంఘం తరఫున హెచ్చరిస్తున్నమన్నారు . తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 5వ తేదీన జరిగే బి ఆర్ ఎస్ కె వి మండల భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆత్మీయ సమావేశానికి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కె వి నాయకులు కుంభం మహేష్ గౌడ్ వడ్లకొండ కొమరయ్య, పోలేపాక రాజేష్, వీరాస్వామి, మాచర్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin