Thursday, 30 July 2026 03:26:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని అంబులెన్స్...

Date : 15 October 2024 10:01 AM Views : 592

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అత్యవసర సమయంలో అందుబాటులో ఉండవలసిన అంబులెన్స్ షెడ్డుకు పరిమితమైంది.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సరైన అంబులెన్స్ అందుబాటులో లేక రోగులు, గర్భిణీలు అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపుగా గత 20 రోజుల నుండి షెడ్డుకే అంబులెన్స్ పరిమితమైంది.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిను ప్రతినెల తనిఖీలు చేస్తు అనేక రకాలుగా సూచనలు ఇస్తూ ఏమైనా సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేస్తున్న అందుకు విరుద్ధంగా ఆసుపత్రి తీరు ఉందని చెప్పవచ్చు.ఆసుపత్రిలో అంబులెన్స్ పనిచేయడం లేదని తెలిసిన పట్టించుకోరా..?ఆసుపత్రిలో అంబులెన్స్ పనిచేయడం లేదని ఆస్పత్రి యజమాన్యం కు తెలిసిన ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.వైద్యుల తీరుపై అసంతృప్తి అనారోగ్యంతో వైద్యం కోసం వచ్చే ప్రజలు వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందించే సమయంలో విసుక్కుంటున్నారని కొంతమంది వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యానికి గురైన ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్.ఇప్పటికైనా మూలన పడ్డ అంబులెన్స్ ను అందుబాటులో తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని ఆసుపత్రికి వచ్చే ప్రజానీకం కోరుతున్నారు. అంబులెన్స్ పని చేయడం లేదని తెలిసినా అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి వారి వల్ల ప్రజా పాలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :