సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలలో కొనసాగుతున్న జర్నలిస్టులు అసోసియేషన్లకు, యూనియన్లకు అతీతంగా ఏకం కావాలని తమ హక్కుల సాధనకై మరో ఉద్యమాన్ని చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టి ఎస్ జె ఏ)వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పిలుపునిచ్చారు.ప్రభుత్వాలకు ప్రజలకు వారదులుగా కొనసాగుతూ ఎటువంటి వేతనాలు లేకుండా ఎంతోకాలంగా జర్నలిజం లో కొనసాగుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న జర్నలిస్టులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు కలం కలం,గళం గళం కలిపి ఉద్యమించేందుకు కలిసి రావాలని యాదగిరి అన్ని అసోసియేషన్ల యూనియన్లలో అదేవిధంగా ఇండిపెండెంట్ గా ఉన్న జర్నలిస్టులందరినీ కోరారు. ఈనెల 17వ తారీకున టీఎస్ జెఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించబోయే నిరసన కార్యక్రమాలలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జర్నలిస్టులు తమ కలాల ద్వారా,గళాల ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యక్షంగ పాల్గొని ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జర్నలిస్టులు అందరూ మన కోసం మన భవిష్యత్తు కోసం చేయబోయే ఉద్యమంలో కలిసి కొట్లాడేందుకు కదలి రావాలని యాదగిరి పిలుపునిచ్చారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన డిమాండ్స్ వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం లేదా ప్రత్యేక ఇల్లు కట్టించి ఇవ్వాలి.ప్రతి జర్నలిస్టు కుటుంబానికి అన్ని ఆసుపత్రులలో చెల్లుబాటయే విధంగా హెల్త్ కార్డులు జారీ చేయాలి.ప్రతి జర్నలిస్టుకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. జర్నలిస్టుల ఆత్మగౌరవం కాపాడేలా ప్రతి జిల్లా కేంద్రాలలో అన్ని సౌకర్యాలతో కూడిన విశాలమైన పక్క జర్నలిస్టు భవనాలు,నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ లు నిర్మాణం చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలి. వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీస్ భరోసా కార్డులు ఇప్పించాలి.ఎలాంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవలు చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్తు,గ్యాస్,పెట్రోల్ ఇవ్వాలి.ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల జర్నలిస్టు మిత్రులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
-----------------------
Admin