సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పట్టణంలో మారోజ్ అహ్లేసున్నత్ వాల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కొత్తగూడెం అసెంబ్లీ ఇంచార్జ్ న్యాయవాది యెర్రా కామేష్ పాల్గొని మాట్లాడుతూ సర్వమానవ సమానత్వం,శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహమ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు.కరుణ, సహనం,ఐక్యత,సామరస్యం వంటి ప్రవక్త బోధనలు ప్రజలందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు. తోటి వారికి సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.దేశంలో శాంతి,సామరస్యాలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మాలోత్ వీరు నాయక్,నాగుల రవికుమార్,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,అనిల్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin