సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గ్రామాలలో, పట్టణాలలో సీజనల్ వ్యాదులు వ్యాపించకుండా ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రే, శానిటేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. లింగగిరి పి హెచ్ సి, హుజుర్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాతావరణంలో జరుగుతున్న పలు మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లింగగిరి పి హెచ్ సి పరిధిలో ఆశ కార్యకర్తలచే చేపట్టిన డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే ని, ఎ.యన్.సి. చెకప్ వివరాలను రిజిస్టర్ నందు పరిశీలించారు. తదుపరి గ్రామం లో క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా లార్వా గుర్తించిన వీరబాబు ఇంటిని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వ్యాపించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.అలాగే పి. హెచ్. సి కి వచ్చే వారికి డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ర్యాపిడ్ టెస్ట్ తోపాటు ఎలిజ టెస్ట్ కొరకు టిహబ్ కి రక్త నమూనాలను పంపాలని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.అనంతరం హుజుర్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను సందర్శించి జ్వరం తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఎలిజ టెస్ట్ కొరకు రక్త నమూనాలను టి హబ్ కి పంపించాలని, వైద్యులు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.ఎవరికైనా డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే హాస్పిటల్ లో అడ్మిన్ అయితే వారికి మెరుగైన చికిత్స అందిస్తారని అలాగే వారి ఇంటికి పరిసరాల ప్రాంతాలలో శానిటేషన్ చేయాలని సూచించారు. తదుపరి హుజూర్ నగర్ పలు వీధులలో పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం హుజూర్ నగర్ ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఆర్వో.ఎఫ్.ఆర్. ధరఖాస్తు ల పై ట్రైబల్,అటవీ, రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. తదుపరి హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయుటకు సరిపడు కూలీలను నియమించుకోవాలని,నిర్మాణ సామాగ్రి లో నాణ్యత పాటించాలని,పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, పనుల పురోగతి లో వేగం పెంచాలని హౌజింగ్ అధికారులకు,కాంట్రాక్టర్ కి కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో ఆర్.డి.ఓ. శ్రీనివాస్,డి.యం.హెచ్.ఓ.కోటాచలం, డిప్యుటీ డి.యం.హెచ్.ఓ.నిరంజన్, హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ సూపరిటీడెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ నాజియా, లింగగిరి పి.హెచ్.సి డాక్టర్ కళ్యాణి,డి.టి.డి.ఓ. శంకర్,తహసీల్దార్లు జ్యోతి, మంగ, సురేందర్ రెడ్డి, కమలాకర్, అటవీ శాఖ అధికారులు, హౌజింగ్ డి ఈ విజయ్ సింగ్ , ఆశ కార్యకర్తలు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin