సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు... ఈరోజు మంగళవారం 24వ తేదీ న నూతన తనకృత కలెక్టరేట్ భవనం మీటింగ్ హాలులో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా మణులు, మహిళా అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల బాలికలను ఆహ్వానించడం జరిగింది. వందల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బాలికలు ఎలా జీవించాలి వాళ్ల జీవిత శైలిని ఏ విధంగా మార్చుకోవాలి ఆడపిల్లలు బయట తిరిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు మరియు షి టీం S I రమాదేవి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin