సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : (ఐడిఓసి) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఈనెల 22.6.23న భారత రాష్ట్రపతి ద్రౌపతి మురుమూరు గారి చేతుల మీదుగా జాతీయ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు గ్రహీతగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికై అవార్డు స్వీకరించినందుకుగాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తూ అవార్డుకు ఎంపికైనందుకు శ్రీ మతి తేజావత సుశీల ఆరోగ్య కార్యకర్త ను జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు మరియు డిఎంహెచ్వో డాక్టర్ జెవిఎల్ శిరీష గారు సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి సుశీలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కష్టపడి విధులు నిర్వహించి జిల్లాకు మంచి పేరు, మరియు ఇంకా ఎన్నో అవార్డులను పొందాలని తెలిపారు. ఈ విధంగా కృషి చేసిన డిఎంహెచ్వో డాక్టర్ జె.వి.ఎల్ శిరీష గారిని, మరియు సిబ్బంది కృషిని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీదురిశెట్టి అనుదీప్ గారు డాక్టర్ జె.వి.ఎల్ శిరీష గారు ,ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రాకేష్ ,అవార్డు గ్రహీత తేజవత సుశీల ప్రభాకర్ రావు గారు, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin