సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపరెడ్డి పల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్పాసులు పంపిణీ. ఈ నెల 16 వ తేదీన అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు జన్మదినం పురస్కరించుకొని గౌ" రాష్ట్ర మంత్రివర్యులు, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR , గౌ" మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ స్పూర్తితో Gift A Smile లో భాగంగా BRS పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చిన హామీ మేరకు BRS నాయకులు వేముల హరీష్ ఆధ్వర్యంలో అన్నపరెడ్డిపల్లి మం" ఎర్రగుంట లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత RTC బస్ పాస్ లు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR గారి చొరవతో విద్యార్థులకు ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు అందుతున్నాయి అని , ఎమ్మెల్యే గారి పేరుతో ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలి అన్న ఉద్దేశంతో వీటిని అందజేయటం జరిగింది అని, దీనితో 1సం" పాటు 20km ల పరిధిలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని, రాబోవు 2-3 రోజుల్లో బస్ కూడా అందుబాటులోకి వస్తుంది అని, విద్యార్థులు అందరూ ఇన్ని ఉచిత సౌకర్యాలను ఉపయోగించుకొని పాఠశాలకు , ఉపాధ్యాయులకు , తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా చదువుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో BRS నాయకులు మామిళ్ళపల్లి చిన్న లక్ష్మణ రావు, వద్ది వెంకటేష్, బోయినపల్లి సుబ్బారావు, నున్నా గోపాలరావు, నేరేళ్ల లాలయ్య ,SK పాషా, ఉప్పతాల శ్రీను, కట్టా శివ, సున్నం ప్రసాద్, కీసరి శ్రీను, బీరపోగు కొండలు, SK జలీల్, SK ఇమామ్,అరవింద్, సుబాని, వెంకటేష్, చంటి, వద్ధి నవీన్, శ్రీను, మౌనిక్, బషీద్,నాగరాజు, కిషన్,వేముల దిలీప్, B శ్రీనివాసరావు, కృష్ణ, రాములు, నాగులు, శివ, కమల్, పాఠశాల HM మోహనరావు, ఉపాద్యాయులు, BRS కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin