సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రం లోని చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా శనివారం స్వయం పరిపాలన కార్యక్రమం నిర్వహించబడినది ఇట్టి కార్యక్రమలో విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని కలెక్టర్, డిఈవో, ఎంఈవో తదితర వేశాధారణలతో అలరించారు. ఈ సందర్బంగా చైతన్య పాఠశాల కరెస్పాండంట్ మేరెడ్డి యల్లారెడ్డి విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలిపారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది ఉండదని చిన్ననాటి నుండి లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సారెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు శరత్, ఆనంద్ హసేన్ మియా, మనోహర్,శ్రావణి,రమాదేవి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin