సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల లో బుచ్చిరాజిపల్లి గ్రామాన్ని సందర్శించి ఓ డి సి ఎస్సై గోపి ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ మోసాలపై, డయల్ 100, దిశ యాప్, పై గ్రామస్తులకు అవగాహన ,సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ డి సి ఎస్ ఐ గోపీనాథ్ అన్నారు. గురువారం ఒడిసి మండలంలోని బుచ్చిరాజిపల్లి లో గ్రామస్థులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ గోపీ మాట్లాడుతూ. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూ డదన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నా యన్నారు. ఇంటర్నెట్‌ను పరిమితికిమించి వాడకూడదని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు నడిపేవారు కొత్త వ్యక్తుల మాటలను నమ్మరాదని, తెలియని మెసేజ్‌లపై క్లిక్ చేయరాదని తెలిపారు. సైబర్ నేరగాళ్లు మాయ మాటలు చెప్తూ బహుమతులు వచ్చాయని, లాటరీ తగిలిందని, లోన్లు ఇస్తామని , ఇతరత్రా ఆశచూపి ఆన్‌లైన్ ద్వారా డబ్బులకు ఎర వేస్తారని, అటువంటి వ్యక్తులు పంపే మెసేజ్‌లకు స్పందించ రాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బది ఏఎస్ఐ కిషోర్ రెడ్డి , కానిస్టేబుల్ రమేష్ గ్రామస్థులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు....
-----------------------
Admin