Thursday, 30 July 2026 02:26:55 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బడుగు బలహీన వర్గాలకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో విద్యాభోదన...

Date : 13 October 2024 09:27 AM Views : 515

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సహకారంతో ఉపముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పోరాటం తో యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ శంఖుస్థాపనలో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ గ్రామం లో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య , భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సంకేపల్లి సుధీర్ రెడ్డి లతో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తుంగతుర్తి శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లో తిరుమలగిరి మండలం తొండ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 98 లో 18.33 ఎకరాలలో సుమారుగా 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రెటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టాపోతున్నామని ఈ నిర్మాణం రోడ్లు & భవనాల శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. ఈ పాఠశాలలో 2560 మంది విద్యార్థులు, 120 మంది ఉపాధ్యాయులు విద్యాభోదన చేస్తారని తెలిపారు.త్వరలో తుంగతుర్తి మండలం వెలుగుపల్లి లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి మన యువత అమెరికా వెళ్ళటం కాదు అమెరికా కంపెనీలే తుంగతుర్తికి తీసుకవచ్చి 4000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. తిరుమలగిరి లో గత 30 సంవత్సరాలుగా వెంటాడుతున్న జూనియర్ కాలేజీ సమస్య ను తీర్చి కాలేజీని మంజూరు చేయనైనదని , మోత్కుర్ జూనియర్ కాలేజీ కి హాస్టల్ వసతి కల్పించనానని త్వరలో బస్ డిపో మంజూరు చేపిస్తానని , 5 చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులు రెండు పంటలు సాగు చేసేలాగా చూసానని , తిరుమలగిరి హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తానని, పునాది కాల్వ కి ఎల్లంపల్లి నుండి నీరు తీసుకొచ్చానని ఇలా విద్య, వైద్య, నీటి పారుదల శాఖలకి సంబందించిన ఒక్కొక్క సమస్య ని పరిష్కరిస్తూ నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు.నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనిది నియోజకవర్గ ప్రజలేనని ఒక్క సామాన్యుడిని అసెంబ్లీ కి పంపారని తెలిపారు.త్వరలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లులు నిర్మించాపోతున్నామని,రోడ్లు లేని మారుమూల తండలకు రోడ్లు వేపించినానని అలాగే ఎస్ ఆర్ ఎస్ పి కాలువకి 27 కిలోమీటర్లు లైనింగ్ కొరకు 650 కోట్లు మంజూరు చేపించినాని తెలిపారు. నియోజకవర్గం లో 405 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయటం జరిగిందని తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: