సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలో చదువు తో పాటు ప్రస్తుత విద్యార్థులకు సాంకేతిక విద్య ఎంతో అవసరం అని, చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర టైప్ రైటింగ్ అసోసియేషన్ కార్యదర్శి, సీనియర్ జర్నలిస్టు కొండా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రూప టైపురైటింగ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహితుడు జనరల్ లో జర్నలిజంలో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పొందటమే కాకుండా గోల్డ్ మెడల్ సాధించిన కవి రచయిత జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణను సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మిత్రబృందం ఘనంగా ఆత్మీయ సత్కారం అందించారు. నేటి పోటీ ప్రపంచంలో అక్కడమిక్ విద్యత్ తో పాటు సాంకేతిక విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకునే క్రమంలో పరిచయమైన చిన్ననాటి మిత్రుడు బంటు కృష్ణ జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించి తన ప్రముఖ వ్యాసాలు, పరిశోధన కథనాల ద్వారా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా 31 సంవత్సరాలుగా నిబ్బరంగా నిలబడి తాను ఈ విజయం సాధించడానికి సాంకేతిక విద్యతో పాటు జర్నలిజం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు చందన నర్సింగ్ సంస్థల ప్రిన్సిపల్ గుండా రమేష్ మాట్లాడుతూ జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా తో పాటు గోల్డ్ మెడల్ ను గవర్నర్ చేతుల మీదుగా అందుకుని అరుదైన ఘనత సాధించినందుకు తమ మిత్రునిగా ఎంతో గర్వపడుతున్నామన్నారు. సూర్యాపేట పేరును రాష్ట్రస్థాయిలో విస్తరింపజేసిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణను శాలువాలతో తో ఘనంగా సన్మానించారు. అవిరళకృషి, నిరంతర సాధన ద్వారా ప్రతివారు కూడా విద్యలో అగ్ర శిఖరాలకు చేరుకోవచ్చు అని సూచించారు. ప్రతివారు చదువుతోపాటు ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్య టైపురైటింగ్ నేర్చుకోవడం తో పాటు సభ్యత, సంస్కారం, మానవత్వం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. సంపద కంటే చదువు ముఖ్యమైనదని, చదువు మనల్ని కాపాడి, సంఘంలో గౌరవ ప్రధంగా నిలుపుతుందని అన్నారు. డాక్టర్ కృష్ణను సన్మానించిన వారిలో జూనియర్ గంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, గోపారాపు రాజు, డీలర్ వుప్పాలంచు కృష్ణ, నవిలిపురి నరేందర్, న్యాయవాది రాచకొండ యాదగిరి, కోటగిరి శ్రీనివాస్, సాతునూరి బిక్షపతి, బంటు సూర్య తదితరులు పాల్గొన్నారు. తదుపరి డాక్టర్ బంటు కృష్ణ స్నేహితుడు గొట్టేముక్కుల వెంకట రమణ శాలువాతో సన్మానించి డైరీ, పెన్ను ఇతర బహుమతులను అందించి గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత బంటు కృష్ణ మాట్లాడుతూ కుల,మత, వర్గ, వర్ణ , లింగ వివక్ష, పేద, ధనిక, చిన్న, పెద్ద భేదభావాలు స్నేహానికి లేవని, స్నేహమే మన జీవితానికి వెలుగు నిచ్చే వెన్నెల అంటూ స్నేహాన్ని మర్చిపోకుండా గోల్డ్ మెడల్ సాధించినందుకు అభినందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
-----------------------
Admin