సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట టౌన్ నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో,జల్లి,నెక్కొండ బస్టాండ్లను ఆర్ఎంతో కలిసి పరిశీలించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ డిపో,బస్సు డిపోకు సంబంధించిన ఖాళీ స్థలాలను వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజయ్ భాను తో కలిసి పరిశీలించి రోడ్డుపైన అభ్యంతరకరమైనటువంటి షాపులను వెనుకకు జరపడంతో పాటు ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ ఏర్పాటు ప్రజలకు అంతరాయం లేకుండా రవాణా సౌకర్యం ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు అదనపు గదుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేసినందుకు పరిశీలించడం జరిగింది వీటితోపాటు చెన్నారావుపేట మండలం జల్లిలో బస్టాండ్ నెక్కొండ బస్టాండు ప్రాంతాలను పరిశీలించి అతి త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సంపేట డిపో మేనేజర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Reporter