సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సర్వతముఖాభివృద్ధి చెందిందని, ప్రజలు మరోసారి సర్కార్ ను ఆశీర్వదించేందుకు ముందుకు వస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నియోజక వర్గంలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పలువురు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. శనివారం పలువురు స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డే స్వామి, కర్ణకోట నరేష్, కర్ణకోట నిరంజన్, చాకలి యాదయ్య, చాకలి అమృత, పెబ్బే వంశీ, కర్ణకోట బందులాల్ తదితరులు పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గ్రామ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin