Thursday, 30 July 2026 09:38:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అపజయం దరిచేరని ఆత్మవిశ్వాసాన్ని బాలికలు పెంపొందించుకోవాలని...

Date : 25 January 2023 12:02 AM Views : 552

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అపజయం దరిచేరని ఆత్మవిశ్వాసాన్ని బాలికలు పెంపొందించుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండల విద్యాశాఖ అధికారి చెన్న కృష్ణ తెలిపారు. కదిరి ప్రజా సేవా సమాజ్ సంస్థకు చెందిన చైల్డ్ లైన్ 1098 అధికారులు కదిరి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సేవా సమాజ్ చైల్డ్ లైన్ డివిజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బాలికలకు హింసలు లేని, వివక్షత లేని సమాజాన్ని నిర్మించి, బాలికలు అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు కల్పించడానికి కుటుంబ స్థాయిలో, సమాజ స్థాయిలో, పాఠశాల స్థాయిలో విస్తృతంగా అవగాహనలు కల్పించడమే ఈ బాలిక దినోత్సవం ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా బాలికల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన వివిధ చట్టాల గురించి తెలిపారు. బాల్య వివాహాలు, అత్యాచారాలు, బాల కార్మికులు, భ్రూణ హత్యలు లాంటి సామాజిక రుగ్మతల నుండి ఈ చట్టాలు మిమ్మల్ని కాపాడతాయని తెలిపారు. బాలబాలికలు ఎవరైనా ఆపదల్లో సమస్యల్లో ఉంటే చైల్డ్ లైన్ 10 9 8 నెంబర్ కు ఫోన్ చేసి ఆపదల నుండి బయటపడవచ్చు అని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి చెన్న కృష్ణ మాట్లాడుతూ బాలికా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. బాలికలు సురక్షితంగా అభివృద్ధి చెందాలంటే కేవలం పుస్తకాలలోని విషయాలే కాకుండా నిత్యజీవితంలో ఉపయోగపడే జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. మన ముందు తరం మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకొని వారి మాదిరే అభివృద్ధి చెందడానికి గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని తెలిపారు. గతంలో కంటే మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు అనేక చట్టాలు వచ్చాయని తెలిపారు. అదేవిధంగా కేవలం బాలబాలికలను ఆపదల నుండి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం చైల్డ్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబరును తీసుకొచ్చిందని తెలిపారు. మీకు సమస్య ఎదురైతే చైల్డ్ లైన్ 1098 కి నెంబర్ కు ఫోన్ చేసి సమస్యల నుంచి గట్టెక్కి ఉన్నతమైన అవకాశాలను అందుకోవాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల గురించి తెలిపారు. ప్రేమ ఆకర్షణల వలన కలిగే దుష్పరిణామాల గురించి తెలియజేశారు. అదేవిధంగా బ్రూణ హత్యలు గురించి విద్యార్థి దశ నుంచే బాలికలు అవగాహన కలిగి ఉండి వాటి వల్ల కలిగే అనర్థాల గురించి తమ తమ గ్రామాలలో, కుటుంబాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. అప్పుడే ఆడబిడ్డ ప్రపంచాన్ని చూడగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సేవా సమాజ్ చైల్డ్ లైన్ 1098 అధికారులు లక్ష్మీ ప్రసన్న, మౌనిక, ఆంజనేయులు మరియు కేజీబీవీ అధ్యాపకు రాళ్లు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: