సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ ఈ..2490 ఐటిసి పిఎస్పీడీ భద్రాచలం యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమ నాయకుడు మోహన్ రావు, పారుపల్లి శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు పినపాక నియోజకవర్గం లో బూర్గంపాడు మండల పరిధిలో అతి తక్కువ మందితో రాష్ట్ర సాధన పోరాటాల్లో పాల్గొన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో బూర్గంపాడు మండలాన్ని ఉంచడానికి తమ వంతు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారుల్ని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మర్చిపోవడం ఉద్యమకారులన్ని గౌరవించకపోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వము గుర్తించకపోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పినపాక నియోజకవర్గం ప్రజాప్రతినిధులు గుర్తించకపోవడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు పోరాటాల ఫలితంగానే ఈనాడు బూర్గంపాడు మండలం గా ఉందని అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మోతి పట్టి నగర్ నియోజకవర్గంగా బూర్గంపాడు కొనసాగేదే అని విభజన తర్వాత మండలంగా మిగిలిందని ఆ మండలం కూడా ఉద్యమకారులు, జర్నలిస్టులు చేసిన పోరాట ఫలితమే ఈనాడు తెలంగాణలో కొనసాగుతుందని తెలియజేశారు. ఆనాడు జెండా పట్టుకుని పోరాటాలు చేసిన వారు ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారని వారందరినీ మర్చిపోయి ప్రస్తుతం జెండాల కింద ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సాధకులు గా చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉజ్జం కార్లు ఎంతో పోరాటం చేశారని వారందరినీ గుర్తించాల్సిన అవసరం ఉందని అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పీడీ పేపర్ కర్మాగారానికి సంబంధించిన తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పనిచేసిన పలువురు ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత ఉద్యమకారులు కె. మోహన్ రావు, పారుపల్లి శ్రీనివాస్ ,టి సత్యనారాయణ , ప్రసాద్, పొడియం నరేంద్ర, సాంబి రెడ్డి, కృష్ణ కుమార్ ,శ్రీపాదరావు దుర్గారావు, ఆకుల రఘు, బాగి వెంకట్రావు, మోహన్ రావు పివి రావు, మూర్తి, వెంకట్, సుదర్శన్, అనిల్, భాస్కర్ ,బాబురావు, పుల్లారావు, రామాంజనేయరెడ్డి, యాకూబ్ పాషా, శ్రీను కృష్ణ సర్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin