Saturday, 13 June 2026 12:50:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ప్రతిపక్ష పార్టీల తీరు విడ్డూరం... -భారత్ జాగృత నియోజకవర్గ కన్వీనర్ ఎండి ముస్తఫా

Date : 20 July 2023 07:59 AM Views : 406

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్: తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు వివరిస్తున్న తీరు విడ్డూరంగా ఉంది అని భారత జాగృతి షాద్ నగర్ నియోజకవర్గం ఎండి ముస్తఫా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి దేశానికి రోల్ మోడల్ గా తయారు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పొలాలను చూసి ప్రతిపక్ష నాయకులు జీర్లించకపోతున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రైతులు అప్పుల, ఆర్థికంగా ఇబ్బందుల నుండి కోలుకుంటున్నారని అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు గంటల విద్యుత్ ఇస్తామని రైతాంగానికి సరిపోతుందని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు అని మీ పద్ధతి మార్చుకోండి రేవంత్ రెడ్డి రైతుల పైన మీరు చూపిస్తున్నటువంటి దొంగ ప్రేమని రైతులు గమనిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ మోటార్రకు మీటర్లు పెడతామని రైతాంగాన్ని వ్యవస్థని నాశనం చేసి అద్వానీ అంబానీలకు అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తుంది రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మాత్రమే బిజెపి ప్రభుత్వం గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల విషయంలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గుర్తించుకోవాలి తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేక స్వచ్ఛమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని గుర్తించుకోవాలి. రైతుల పైన తెలంగాణ పైన కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నటువంటి బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు మరణాలు తగ్గాయి రైతు ఈరోజు సుఖసంతోషంతో ఉన్నాడు. రైతులు బీమా, రైతు బంధు ఎరువుల విషయంలో తీసుకున్న అన్ని సకాలంలో తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజులకు రైతులకు దగ్గరైన ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ అన్న విషయం గమనించుకోవాలి. వరి పంట భారతదేశంలోనే మొదటి స్థానం సంపాదించిన ఘనత భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది బియ్యం విషయంలో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అలాంటి రాష్ట్రంలో మనం ఉన్నందుకు గర్వించాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ని తెలంగాణ ప్రభుత్వాన్ని అవమాన పరుస్తున్నటువంటి బిజెపి నాయకులు, కాంగ్రెస్ నాయకులు గుర్తించుకోండి. రాబోయే రాజుల్లో మీకు సమాధి కడతారు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని విద్వేష్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ బిజెపి ప్రభుత్వం కాలాన్ని గడుపుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అరాచకాలు మీరు చేసినటువంటి పాపాలు ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 1200 మంది విద్యార్థుల బలిదానికి కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని హెచ్చరిస్తున్నాం. తెలంగాణని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది గుర్తించుకుంటే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులారా భారత రాష్ట్ర సమితి ఏనాడూ కూడా ప్రజలకు మోసం చేయలే ఈరోజు ప్రజలని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కెసిఆర్ గుర్తుంచుకోండి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ పక్షాన ఉన్నారు కేసీఆర్ కి మూడోసారి పట్టం కట్టి భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎమ్మెల్యేలను గెలిపించి ఎంపీలను గెలిపించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇస్తారు ప్రజలు గుర్తుంచుకోవాలని తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ ముస్తఫా అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :