సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లో (ఆర్టీఐ ఆక్టివిస్ట్ అసోసియేషన్) సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గద్దల ముత్తు ఆదేశాను సారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కార్యకర్తల అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ బరిగెల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి సమాచార హక్కు కార్యకర్తల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 38/2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తల అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ఏ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం2005 చట్టం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైనదన్నారు.భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరులు ప్రభుత్వ సంస్థలు కార్యాలయాల్లో కానీ...??? ప్రైవేటు సంస్థలు కార్యాలయాల్లో కానీ...??? సరైన సమయంలో విధులు నిర్వహించాల్సిన అధికారులు విధులు నిర్వహించకపోయిన గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ రూపాలలో గ్రామాల అభివృద్ధికి వచ్చిన నిధులు వాటి ఖర్చు చేసిన విధానం మిగిలిన రూపాయలు, వాటిని దేనికి ఖర్చు చేయబోతున్నారు మొదలైన వివిధ రకాల విషయాలు ఈ సమాచార హక్కు చట్టం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైనా సరే ఏదైనా సమాచార హక్కు చట్టం కింద అడిగి తెలుసుకోవచ్చు అని కలెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన అవినీతిని వెలికితీసి అట్టి ప్రభుత్వ అధికారుల నుంచి కాజేసిన ప్రజా ధనాన్ని రికవరీ చేయవచ్చు అని ఎవరికైనా సమాచారం కావాలంటే గ్రామ స్థాయిలో తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జత చేసి సమాచారం కోరవచ్చు అని తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఎంతటి సమాచారం అయిన సరే పూర్తి ఉచితంగా తీసుకోవచ్చు అని, తెల్ల రేషన్ కార్డు లేనివారు మండల స్థాయిలో అయితే ఐదు రూపాయల కోర్టు ఫీ స్టాంప్, డివిజన్, జిల్లా, రాష్ట్ర పరిధిలో సమాచారం కావాలంటే పది రూపాయల కోర్టు ఫీ స్టాంప్ పెట్టిన కావాల్సిన సమాచారం కోరవచ్చు అని సూర్యాపేట జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఏ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సమాచార హక్కు చట్టం బ్రహ్మాస్త్రం అని నేడూ ప్రతి ఒక్కరూ మీమీ గ్రామాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటి ఖర్చు చేసిన విధానం, మిగిలిన రూపాయలు మొదలైన ఇంకా ఎన్నెన్నో అంశాల గురించి తెల్సుకోవాలి అని ఆయన అన్నారు.ఈ సమాచార హక్కు చట్టం 2005 ను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థల అధికారులు పిఐఓలు సమాచార హక్కు చట్టం సభ్యులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి ,టి ఎస్ జే ఏ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గట్టిగుండ్ల రాము, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొరివి సతీష్ యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలుకల చిరంజీవి, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు, తెలంగాణ స్టేట్ జర్నలిస్టుల అసోసియేషన్ సూర్యాపేట జిల్లా గౌరవ అధ్యక్షులు మరియు ఆర్టీఐ ఆక్టివిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ బరిగెల విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
-----------------------
Admin