Friday, 31 July 2026 05:56:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదల భూమి కబ్జాకు పాల్పడిన అధికార పార్టీ కీలక నాయకులు...

Date : 25 September 2023 04:14 AM Views : 666

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : 2000 గజాల క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా... పాత్రధారులు,సూత్రధారులపై చర్యలు శూన్యం పాత కొత్తగూడెంలో పేదలకు ఇచ్చేందుకోసం ప్రతిపాదించిన స్థలంలో రాత్రికిరాత్రి అధికార పార్టీ మున్సిపల్ పాలకపక్షంలోని కీలక వ్యక్తి కబ్జాకి పాల్పడ్డాడని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పాత కొత్తగూడెంలోని పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీలో,మున్సిపాలిటీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి,క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన 2000 గజాల స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు.ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు హుటాహుటిన ఇక్కడకు చేరుకొని కబ్జా చేసిన స్థలాన్ని రాత్రికిరాత్రే వెలిసిన కాంపౌండ్ ను తొలగించారని తెలిపారు.తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తే సరిపోదని సదరు వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.క్రీడా స్థలం పేరుతో ప్రభుత్వ స్థలాన్ని సొంతంగా ఆక్రమించుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు.మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్తగూడెంలోని తహసీల్దారులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని,వీరి స్థానంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దారులకు కొత్తగూడెం నైసర్గిక స్వరూపం తెలియదని,దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను తమదిగా చెప్పుకుంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల్సి ఉందని,కొందరు రెవెన్యూ అధికారులు,మున్సిపల్ సిబ్బంది అక్రమ సంపాదనకు అలవాటు పడి దొడ్డిదారిలో ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులకు లోపాయకారికంగా ఇచ్చేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్తగూడెం నడిబొడ్డులో రైతు బజార్ స్థలాన్ని సైతం ఈ విధంగానే ఆక్రమించేందుకు పాల్పడిన వ్యక్తులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు.కొత్తగూడెంలో అధికార పార్టీ నాయకుల భూదోపిడికి, కబ్జాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.లేని పక్షంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,జిల్లా సహాయ కార్యదర్శి చెనిగారపు నిరంజన్ కుమార్,అసెంబ్లీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,విన్నూ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: