Thursday, 30 July 2026 05:11:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దసరా పండుగ సందర్భంగా బాకీ కార్డ్ విడుదల చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 03 October 2025 01:58 PM Views : 411

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా రేపు ఎల్లుండి రెండు రోజులపాటు బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు... ఈ సందర్భంగా మాట్లాడుతూఅసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో ఆరూ గ్యారెంటీలు 420 హామీలు నెరవేరుస్తామని చెప్పి తన మేనిఫెస్టోలో పెట్టి 700 రోజులు గడిచిన ఇప్పటివరకు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడింది రైతులను, రైతు కూలీలను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను ఇలా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసినా కాంగ్రెస్ పార్టీ రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు, రైతు భరోసాను ఎగబెట్టారు, వడ్లకు బోనస్ ఇవ్వలేదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో రైతులు మహిళలలు చిన్నపిల్లలు కుటుంబాలతో సహా నెలల తరబడి క్యూ లైన్ లో నిలబడి అనేక ఇబ్బందులు పడ్డారు.. సరైన సమయంలో రైతులకు యూరియా అందక పంటల దిగుబడి తగ్గి రైతులు పంట నష్టపోవడం జరిగింది పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎకరాకు 25000 ఇవ్వాలని నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ ఎలాంటి చరణం లేకపోవడం దురదృష్టకరం కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను అమలు చేయని హామీలను ప్రతి ఇంటింటికి వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ మరియు అన్ని మండల కేంద్రాలలో గ్రామాల్లో వార్డుల వారిగా ప్రతి నాయకుడు కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్లి బాఖీ కార్డ్స్ ని పంపిణీ చేస్తూ విధిగా సెల్ఫీలు ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవలసిందిగా తెలిపారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు బాకీ కార్డు చూపించి, హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను నిలదీయవలసిందిగా కోరారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాకీ కార్డ్స్ ను బ్రహ్మాస్త్రంగా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: