Thursday, 30 July 2026 03:25:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విషం కక్కుతున్న బీజేపీ ఐటీ సెల్... - తమ్మినేని

Date : 11 February 2023 12:41 AM Views : 664

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం : దేశవ్యాప్తంగా మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఐటీ సెల్ ద్వారా వివిధ తరగతుల వర్గ ప్రజల మధ్య తీవ్ర ఘర్షణకు ప్రయత్నం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవనంలో జరిగిన జిల్లా సోషల్ మీడియా వర్క్ షాప్ నాయకులు పి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో బీజేపీ శ్రేణులు విషం కక్కుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను మాయ పరచాలని చూస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో వందలాది మంది ఉద్యోగులను పెట్టుకుని ఫేక్ ఐడి లు సృష్టించి మరీ లౌకిక పార్టీల విధానాలపై అసభ్యకరమైన భాషతో దొంగ ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని, దేశ ప్రజలను, దేశ వనరులను అదానీ లాంటి వారికి అమ్మి, ప్రశ్నించిన వారిపై, విమర్శలు చేసిన వారిపై దేశ ద్రోహులు అని ముద్ర వేయడంలో బీజేపీ ఐటీ సెల్ ముందు వుందని విమర్శించారు. బీజేపీ అబద్దాల ప్రచారంపై ఎప్పటి కప్పుడు సీపీఎం పార్టీ శ్రేణులు శాస్త్రీయ ఆధారాలతో బీజేపీ ప్రభుత్వం విధానాలను ఎండగట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు పిట్టల రవి, వై విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :