Saturday, 13 June 2026 11:40:18 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నేర పరిశోనలో అత్యుత్తమమైన ప్రతిభకు గుర్తింపుగా కోదాడ డి యస్ పి శ్రీ మామిళ్ల శ్రీధర్ రెడ్డికి...

Date : 01 November 2024 02:50 AM Views : 909

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : జాతీయ సమైక్యత దినోత్సవం (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ, నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా, సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డి యస్ పి శ్రీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి కి 2024 సంవత్సరానికి "కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతాకాన్ని" ప్రకటించటం జరిగింది. 1998 నవంబర్ లో సబ్-ఇన్స్ పెక్టర్ గా ఎంపికైన శ్రీ మామిళ్ల శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో , రాచకొండ కమిషనెరేట్ మరియు ప్రత్యేక నిఘా విభాగంలో పనిచేసారు. ప్రతిష్ట్మాకమైన ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరుపున ఎంపికై 2016-17 లో హైతీ దేశంలో పోలిస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పని చేసారు. సంచలనాత్మక హాజీపూర్ కేసులో ముగ్గురు మైనర్ బాలికల అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని తన సాంకేతికత నైపుణ్యాన్నీ ఉపయోగించి స్వల్పకాలంలోనే అరెస్ట్ చేయడంలో, అత్యంత కీలక పాత్ర పోషించటం జరిగింది. నర్సింహులగూడెం ఫ్యాక్షన్ హత్య కేసు, మరో మూడు హత్య, అనేక దోపిడీ, దొంగతనాల కేసుల ఛేదన మరియు దర్యాప్తును తనదైన శైలీలో కృషి, పట్టుదలతో చేసి అనేక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా విధులను నిర్వహిస్తూ, అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. 26 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక మైన శాంతి భద్రతల విషయాల్లో, సామాజిక విషయాల్లో , పోలీస్ ప్రజా సంబంధాలను పటిష్టం చేయటంలో, అనేక తీవ్రవాద, దోపిడీ, హత్య , మనుషుల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల కేసుల్లో తన ప్రతిభ పాటవాలను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పొలిసు ఉన్నతాధికారులు, గతంలో కూడా పోలీస్ సేవ పతాకాన్ని, తెలంగాణ రాష్ట్ర శౌర్య పతాకాన్ని, ఉత్తమ సేవ పతాకాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతాకాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ బహుకరించటం జరిగింది. అంతేకాకుండా 2015 లో పంజాబ్ లో జరిగిన అఖిల భారత స్థాయి డ్యూటీ మీట్ లో ఫోరెన్సిక్ సైన్స్ విభగంలో రజత పతాకాన్ని సాధించారు. 2017 లో ఐక్య రాజ్య సమితి శాంతి పతాకాన్ని సాధించారు. మరో రెండొందలకు పైగా రివార్డులు/అవార్డులు పొందారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీ శ్రీ జితెందర్ ఐపీస్ , శాంతి భద్రతల అదనపు డీజీపీ శ్రీ మహేష్ భగవత్,ఐపీస్ , జోనల్ ఐజీపీ శ్రీ సత్యనారాయణ ఐపీస్ , సూర్యాపేట జిల్లా యస్ పి శ్రీ సన్ ప్రీత్ సింగ్, ఐపీస్ & అదనపు యస్ పి నాగేశ్వర్ రావు మరియు ఇతర అధికారులు కోదాడ డి ఎస్ పి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేక అభినందనలు తెలిపారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :